సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్.. బీజేపీ అధ్య క్షుడు కిషన్ రెడ్డి వేర్వేరు కాదు.. కేసీఆర్ అనుచరుడు కిషన్ రెడ్డి.. కేసీఆర్ భాషనే ఆయన మాట్లాడుతు న్నారు. బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారో .. కిషన్ రెడ్డిని ఎందుకు నియమించారో ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి తెలుసు’ అని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీడ బ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తాజ్‌కృష్ణ హోట ల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక బీజేపీ, బీ ఆర్‌ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్‌పై దాడి కి దిగుతున్నాయని మండిపడ్డారు. గతంలో ఎన్న డూ లేనివిధంగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగు తున్నప్పుడే ఆ మూడు పార్టీలు పోటాపోటీగా సెప్టెంబర్ 17న సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తు న్నాయని ఆరోí³ంచారు. కాంగ్రెస్ సభను అడ్డుకు నేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంలు బయట నుంచి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయన్నారు.
సానుభూతి కోసం బిడ్డను సైతం..
కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక రాబోయే ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం సీఎం కేసీఆర్ తన బిడ్డను సైతం జైలుకు పంపేందుకు వ్యూహం పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించా రు. కవితను తీహార్ జైలులో పెట్టేలా మోదీతో కేసీ ఆర్ ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు ప్రధాని కూడా సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్‌ఎస్ నాటకాలాడుతున్నాయన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టిన బీఆర్‌ఎస్.. ఆ స్కామ్‌లో వాటాలు పొందుతున్న బీజేపీ.. కాంగ్రెస్‌ను నిందించడం తప్ప ఏం చేయగలవని నిలదీశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన కేసులో మాత్రమే కవిత ఇరుక్కున్నారని, అంతేగానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు.
రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరేందుకే..
తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేర్చేందుకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ప్రకటన ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా వెనక్కి వెళ్లలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేర్చడానికి విజయభేరి సభలో ఆరు గ్యారంటీలు ప్రకటిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో మంత్రివర్గ భేటీలో ఆమోదించి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శించారు.


