టీడీపీలో పరిణామాలపై ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు | Prathipati Pulla Rao Sensational Comments On Consequences In Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీలో పరిణామాలపై ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు

Jun 2 2023 9:54 PM | Updated on Jun 2 2023 10:01 PM

Prathipati Pulla Rao Sensational Comments On Consequences In Tdp - Sakshi

టీడీపీలో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్‌, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడేనంటూ వ్యాఖ్యానించారు.

సాక్షి, అమరావతి: టీడీపీలో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్‌, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడేనంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఫౌండేషన్‌, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలను ఎంటర్‌టైన్‌ చేస్తే ఎలా?. అక్కడో రూ. 10వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి టికెట్‌ కావాలంటే ఇచ్చేస్తారా?. ఇప్పుడేదో రూ.కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. తర్వాత చేతులెత్తేస్తారు’’ అని  ప్రత్తిపాటి అన్నారు.

‘‘ఎన్నికల ముందే ఫౌండేషన్‌, ట్రస్టుల పేరుతో నేతలు హడావుడి చేస్తారు. నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్‌, ట్రస్ట్‌ నేతలు ఏమయ్యారు?. ఫౌండేషన్‌, ట్రస్టుల పేరుతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారు?. ఈ నేతలంతా ఎన్నికల ముందొస్తారు.. తర్వాత వెళ్లిపోతారు. ఎమ్మెల్యేనని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్‌ఆర్‌ఐల దగ్గర షో చేయడానికో వస్తారు. భాష్యం ప్రవీణ్‌కు.. చిలుకలూరిపేటకు సంబంధమేంటి?. కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందే’’ అని  ప్రత్తిపాటి పుల్లారావు తేల్చి చెప్పారు.
చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?

Advertisement
 
Advertisement
Advertisement