చంద్రబాబూ.. అంత మోసమా: పెద్దిరెడ్డి | Peddireddy Says Chandrababu Govt Negligence Towards Mango Farmers | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. అంత మోసమా: పెద్దిరెడ్డి

Jun 15 2025 10:53 AM | Updated on Jun 15 2025 11:05 AM

Peddireddy Says Chandrababu Govt Negligence Towards Mango Farmers

సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌  చేశారు. ఎక్కువ పంట వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 8 రూపాయలు కిలో కొనుగోలు చేయమని చెప్తే 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా రైతులను ఎలా గిట్టుబాటు ధర కల్పిస్తారు?. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద 100 టోకెన్లు వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చి, మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కిలో 15 రూపాయలు యావరేజ్‌కు మామిడి కొనుగోలు చేశారు. గత మూడేళ్లుగా దాదాపు రూ.22 రూపాయలు గిట్టుబాటు ధర పలికింది. ఇప్పుడు మరి దారుణంగా చంద్రబాబు పాలనలో కిలో 4 రూపాయలకు ఫ్యాక్టరీలు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు.

ఏలూరు జిల్లా, నూజివీడు, కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదిలిలో వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా రైతులపై కేసులు పెట్టారు. ఏ పంటకు మీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు పాలనలో రైతులు గురించి పట్టించుకున్నది ఎన్నడు లేదు. వ్యవసాయం చేయడం దండగ అని చంద్రబాబే అన్నారు’’ అని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

ఏ ఫ్యాక్టరీలో 4 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు జీడి నెల్లూరులో రైతులు ఆందోళన చేశారు. రైతులు సరైన వివరాలు లేకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర వ్యాపారంగా ఉన్న మామిడి రైతులను గిట్టుబాటు ధర 8 రూపాయలు కల్పించి ఆదుకోవాలి’’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement