నల్లారి కిరణ్‌పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌ | Peddireddy Ramachandra Reddy Comments On Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

నల్లారి కిరణ్‌పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Apr 1 2024 10:37 AM | Updated on Apr 1 2024 1:25 PM

Peddireddy Ramachandra Reddy Comments On Kiran Kumar Reddy - Sakshi

చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టడా? అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలిపారు.

‘‘చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్‌. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్దాలు చెప్తున్నాడు’’ అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘కిరణ్‌కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్‌రెడ్డిది. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్‌రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్‌ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

‘‘సీఎం జగన్‌ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement