సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా!.. మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్‌ | Sakshi
Sakshi News home page

సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా!.. మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్‌

Published Sat, Mar 9 2024 9:11 PM

Minister Ambati Rambabu Interesting Tweet On Chandrababu And Pawan - Sakshi

సాక్షి, గుంటూరు: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిల్లో చురకలు అంటించారు. ‘‘సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా.. సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా?’’ అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో మోదీ వస్తే ముస్లింల మీద, క్రైస్తవుల పై దాడులు జరుగుతాయంటూ 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షాపై రాళ్లు వేసిన చరిత్ర చంద్రబాబుది. పాచిపోయిన లడ్డూ ఇచ్చారని కేంద్రాన్నిపవన్‌ విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారు’’ అని మండిపడ్డారు.

ఇదీ చదవండి: బాబు కన్నింగ్‌.. ఏపీ బీజేపీ గగ్గోలు !
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement