రేవంత్.. నా మాటలను గుర్తు పెట్టుకో: కేటీఆర్‌ | ktr counter to cm revanth reddy over rajiv gandhi statue | Sakshi
Sakshi News home page

రేవంత్.. నా మాటలను గుర్తు పెట్టుకో: కేటీఆర్‌

Aug 20 2024 1:50 PM | Updated on Aug 20 2024 3:05 PM

ktr counter to cm revanth reddy over rajiv gandhi statue

హైదరాబాద్‌, సాక్షి: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. చీప్ మినిస్టర్ రేవంత్ నా మాటలను గుర్తు పెట్టుకో అని కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. 

‘మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచన విధానాన్ని చూపుతుంది. మీరు మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని కేటీఆర్‌ అన్నారు.

రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం

ఇదిలా ఉండగా.. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘‘రాజీవ్‌ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్‌ విగ్రహం స్థానంలో కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement