‘పెండ్లికి పోతున్నావో.. పేరంటానికే పోతున్నావో..’ | KTR Again Satires CM Revanth Over Delhi Tours | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఢిల్లీ పర్యటనలపై KTR సెటైర్లు

Nov 25 2024 4:48 PM | Updated on Nov 25 2024 5:14 PM

KTR Again Satires CM Revanth Over Delhi Tours

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు సంధించారు. తాజా ప్రెస్‌మీట్‌లో ఢిల్లీ పర్యటనలపై రేవంత్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌ ద్వారా కేటీఆర్‌ స్పందించారు.

పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని.. కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని, దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ పౌరులుగా తమకు ఉందని అన్నారాయన. అలాగే.. బడేభాయ్‌, చోటామియాలు ఈడీ దాడులు బయటపడకుండా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు కేటీఆర్‌.  

 

తామేం రేవంత్‌లా ఢిల్లీ గులాములం కాదని.. పోరాటం తమ రక్తంలోనే ఉందని, మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే అంటూ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన. 

ఇదీ చదవండి: ‘ఢిల్లీకి వెళ్లేది వాళ్లలా కాళ్లు పట్టుకోవడానికి కాదు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement