అదానీ నిధులను నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్‌ | CM Revanth Respond On Adani Donates 100 Crores To Skill University | Sakshi
Sakshi News home page

స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు.. నిరాకరిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌

Nov 25 2024 3:25 PM | Updated on Nov 25 2024 6:04 PM

CM Revanth Respond On Adani Donates 100 Crores To Skill University

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని తెలిపారు. అదానీ సంస్థ కూడా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద రూ. 100 కోట్ల రూపాయలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి  విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని, డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాశామన్నారు.  

అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వార్తలు రాయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నట్లు చెప్పారు.

రేవంత్‌ ఇంకా మాట్లాడుతూ..

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదాని వంద కోట్లు ఇచ్చిన విషయాన్ని మీడియా రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించింది. 
  • రాహుల్ కూడా స్పష్టంగా సమాధానం చెప్పారు.
  • అదానీకే కాదు ఏ సంస్థలకైనా రాజ్యాంగ బద్దంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉంటుందని రాహుల్‌ చెప్పారు
  •  చట్టబద్దంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి.
  • గొప్ప ఉద్ధేశంతో  స్కిల్‌ యూనివర్సిటీ ప్రారంభించాం
  • స్కిల్స్ యూనివర్సిటీ కి వంద కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తామని అదాని కంపెనీ లేఖ ఇచ్చింది.
  • ఇప్పటి వరకు ఓక్క రూపాయి కూడా స్కూల్ యూనివర్సిటీ నిధులు తీసుకోలేదు.
  • అదాని నుంచి వంద కోట్లు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ విషయాన్ని నిన్ననే అదాని కంపెనీకి లేఖ ద్వారా తెలియజేశాం.
  • తెలంగాణను  వివాదాలకు లాగొద్దనే అదాని వంద కోట్లు వద్దన్నాం
అదానీ అంశంపై దుమారం చెలరేగుతోంది: రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.

  • ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేబినెట్‌ విస్తరణ అని అంటున్నారు. అది తప్పు
  • ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.
  • ఈరోజు ఓంబిర్లా కూతురు వివాహానికి వెళ్తున్నాం.
  • రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అవుతాను.
  • తెలంగాణ ప్రయోజనాలను సభలో మాట్లాడాలని సూచిస్తా.
  • ఫామ్‌హౌజ్‌లో పడుకుంటే ప్రయోజనం ఉండదు.. 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాం
  • వాళ్లలాగా గవర్నర్‌ అనుమతి ఇవ్వకుండా పైరవీలు కోసం వెళ్లం
  • అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతి ఇవ్వకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వెల్లడం లేదు
  • 10 ఏళ్లు మా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు.
  • తెలంగాణకు నిధులు ఇవ్వాలని పార్లమెంటులో ఒత్తిడి చేస్తాం
  • బీజేపీ ఖజానా నుంచి నిధులు ఇవ్వడం లేదు
  • మన హక్కుల కోసం ఢిల్లీ వెళ్లాలి, నిధులు తెచ్చుకోవాలి

మీ  కడుపుమంట మాకు తెలుసు. మీ కాకి గోల పట్టించుకోం

  • బీఆర్‌ఎస్‌ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి.
  • జైలుకు పోయినవారు సీఎం అయ్యారని, కేటీఆర్‌ మాటిమాటికి జైలుకు వెళ్తా అని అంటున్నాడు
  • కేటీఆర్‌ కంటే ముందు జైలుకు చెల్లిపోయింది.. ఆ అవకాశం కూడా లేదు.
  • విచారణ అంటే కేసులు పెడుతున్నారని అంటున్నారు
  • అలా అయితే  అదానీకి ప్రాజెక్టులు  ఇచ్చిన కేసీఆర్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలా?
  • కేసీఆర్‌ లాగా అదానీ నుంచి మేమేం నొక్కేయలేదు.
  • అదానీ ఫ్లైట్లలో ప్రయాణించేది వాళ్లే
  • అదానీకి భూములు, కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ వాళ్లే
  • గతంలో మీరు  హేవేలు డేటా సెంటర్లు  కేటాయించారు.
  • మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలి
  • ఒప్పందాలు రద్దు చేయాలంటే న్యాయ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.
  • మేము ఎవరికి అప్పనంగా భూములు కట్టబెట్టం


నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడటం బీఆర్‌ఎస్‌కు అలవాటైంది

  • అదానీ దగ్గర కేసీఆర్‌లా నేను ఇంత వంగి వంగి లేను
  • 2023లో అధికారం పోయింది
  • 2024 డిపాజిట్‌ కోల్పోయారు.
  • ఇప్పుడు మెదడు కూడా లేకుండా పోయింది
  • బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరగాలనేది మా విధానం
  • వయనాడ్‌, నాందేడ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు
  • రెండు ఎంపీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ, నాయకత్వాన్ని ప్రజలు చీత్కరించారు
  • రాష్ట్రానికి సంబంధించి ఒక రకంగా కేంద్రానికి సంబంధించిన ఎన్నికల్లో ఒకరకంగా తీర్పు ఇచ్చారు’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement