అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. కూటమి సర్కార్‌ వేధింపుల పర్వం | Illegal Cases Against Ysrcp Social Media Workers By Chandrababu Govt | Sakshi
Sakshi News home page

అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. కూటమి సర్కార్‌ వేధింపుల పర్వం

Nov 3 2024 9:17 PM | Updated on Nov 3 2024 9:31 PM

Illegal Cases Against Ysrcp Social Media Workers By Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, నందిగామ సహా అనేక ప్రాంతాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అండగా నిలిస్తోంది.

కాగా, నెల్లూరులో వైఎస్సార్‌సీపీ వింజమూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ పెసల శివారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. శివారెడ్డి తన ఫోటో స్టూడియోలో ఉండగా ఐడీ పార్టీ పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లారు. మరో వైపు, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ లోకల్‌ పోలీసులు దాటవేస్తున్నారు. శివారెడ్డి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement