బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు, కవిత రియాక్షన్‌ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు, కవిత రియాక్షన్‌

Published Sun, Dec 3 2023 5:02 PM

Harish Rao Reaction To Brs Defeat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్‌ఎస్‌కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్‌ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు.

బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారని హరీష్‌రావు అన్నారు.

బీఆర్‌ఎస్‌ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు.
చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement