‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్‌ ఆయనే’ | Congress MP Chamala Kiran Kumar Reddy Slams Etela | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్‌ ఆయనే’

Jun 2 2025 4:19 PM | Updated on Jun 2 2025 6:59 PM

Congress MP Chamala Kiran Kumar Reddy Slams Etela

హైదరాబాద్:  తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్‌ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందరేనని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను వదిలి పెట్టిన అంటున్న ఆయన.. 24 గంటలు బీఆర్‌ఎస్‌ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల రాజేందర్‌ బీజేపీలో ఉన్న విషయం  ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. 

‘ లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవికోసం రైట్ వింగ్ లోకి పోయాడు.. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ప్రస్టేషన్‌తో ఈటెల రాజేందర్‌ మాట్లాడొద్దు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి..రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ ,కార్పొరేషన్ చైర్మన్ లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుంది అని హరీష్ రావు అంటుంన్నాడు..

మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్‌ఎస్‌ వాళ్లు. నిన్న కౌంటర్‌గా కేసులు కూడా పెట్టారు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని పదేండ్లు అనుభవించారు..అధికారుల లిస్ట్ రెడ్ బుక్‌లో నమోదు చేస్తా అనడం విడ్డూరంగా ఉంది. 

అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడనైనా ఉండి సమీక్ష చేస్తడు...ములుగు అడవుల్లోనైన సమీక్ష చేస్తడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టాం’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement