పవన్‌ కల్యాణ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు | Complaint On Pawan Kalyan For Using National Flag In Nomination Rally | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ ర్యాలీలో జాతీయ పతాకం.. పవన్‌ కళ్యాణ్‌పై ‘ఈసీ’కి ఫిర్యాదు

Apr 23 2024 4:27 PM | Updated on Apr 23 2024 5:11 PM

Complaint On Pawan Kalyan For Using National Flag In Nomination Rally - Sakshi

సాక్షి,కాకినాడ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జర్నలిస్టు నాగార్జున రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరిగిన నామినేషన్‌ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ పతాకాన్ని వినియోగించడంపై అభ్యంతరం తెలిపారు. 

పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం(ఏప్రిల్‌ 23) పవన్‌కళ్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు ఉల్లంఘించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కూటమి కార్యకర్తలు చొచ్చుకువచ్చారు. 

నామినేషన్‌లో ఆస్తులు వెల్లడించిన పవన్‌ కల్యాణ్‌

  • పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ. 114 కోట్ల 76 లక్షలు 
  • అప్పులు రూ.64.26 కోట్ల రూపాయలు

ఇదీ చదవండి.. కూటమి వెన్నులో వణుకు.. వైఎస్‌ఆర్‌సీపీలో భారీ చేరికలు 

Advertisement
 
Advertisement
Advertisement