జోడో పోయే.. డోజో వచ్చే | Bharat Dojo Yatra Soon Says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

జోడో పోయే.. డోజో వచ్చే

Aug 29 2024 3:08 PM | Updated on Aug 29 2024 5:23 PM

Bharat Dojo Yatra Soon Says Rahul Gandhi

ఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్‌..త్వరలో భారత్‌ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.

ఈ సందర్భంగా..‘గత ఏడాది భారత్‌ జోడో న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించా.ఆ యాత్రలో ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజు  సాయంత్రం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా  నేను బస చేసే ప్రాంతంలో యువ మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యార్థుల్ని కలిశాను’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ మార్షల్ ఆర్ట్స్‌ని యువతకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. మార్షల్‌ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సమాజంలో అందరూ సేఫ్‌గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ కచ్చితంగా నేర్చుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement