కేసీఆర్‌.. క్యాన్సర్‌ కంటే డేంజర్‌: బండి సంజయ్‌ | Bandi Sanjay Sensational Comments On Cm Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌.. క్యాన్సర్‌ కంటే డేంజర్‌: బండి సంజయ్‌

Aug 23 2023 4:34 PM | Updated on Aug 23 2023 4:39 PM

Bandi Sanjay Sensational Comments On Cm Kcr - Sakshi

కేసీఆర్‌.. క్యాన్సర్‌ కంటే డేంజర్‌ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేసీఆర్‌.. క్యాన్సర్‌ కంటే డేంజర్‌ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ మూడోసారి సీఎం అయితే అంతకంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా?.. మీకోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా?’’ అని ప్రశ్నించారు.

‘‘కేసీఆర్‌ను తరిమి తరిమికొట్టి రామరాజ్యం తేవడమే బీజేపీ లక్ష్యం. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులంతా దండు పాళ్యం ముఠా. వాళ్లను జనం ఓడిస్తారని కేసీఆర్‌కు తెలిసిపోయింది. చివర్లో వాళ్లలో సగం మందికి బి ఫాం ఇవ్వకూడదని సీఎం ఎత్తుగడ వేసిండు’’ అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు

Advertisement
 
Advertisement
Advertisement