Ambati Rambabu Key Comments Over Srivani Trust In Tirumala - Sakshi
Sakshi News home page

శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు: మంత్రి అంబటి సీరియస్‌

Jul 21 2023 10:22 AM | Updated on Jul 21 2023 11:01 AM

Ambati Rambabu Key Comments Over Srivani Trust In Tirumala - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుమల: మంత్రి అంబటి రాంబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి.. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, శ్రీవాణి ట్రస్ట్‌పై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా టీటీడీపై విమర్శలు చేస్తున్నారు. గొప్ప ఆశయంతో శ్రీవాణి ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. నూతన ఆలయాల నిర్మాణ, శిథిలావస్థలో ఉన్న ఆలయాల ఆధునీకరణ, ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు వినియోగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ పెట్టడం వల్ల దళారీ వ్యవస్థ తగ్గింది. ట్రస్ట్‌పై విమర్శలు చేస్తున్న వారికి ఇకనైనా బుద్ధి రావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో రామోజీరావుకు షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement