అంగారక చతుర్థి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అంగారక చతుర్థి వేడుకలు

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

అంగార

అంగారక చతుర్థి వేడుకలు

మంథని: ప్రసిద్ధ మంత్రపురి అష్టభు జ గణపతి దేవాల యంలో మంగళవా రం అంగారక చతుర్థి వేడుకలను వైభ వంగా నిర్వహించా రు. స్వామివారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఆలయ ఆవరణలో శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మంథనితోపాటు సమీప ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.

జాప్యం లేకుండా సేవలు

రామగిరి(మంథని): కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సేవలను జాప్యం లేకుండా అందిస్తున్నా మని సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్‌ గోవర్ధన్‌ అన్నారు. ప్రయాస్‌ కార్యక్రమంపై మంగళవా రం స్థానిక జీఎం కార్యాలయంలో సమీక్షించా రు. తొలుత ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగుల రివైజ్డ్‌ పింఛన్‌ పేమెంట్‌– 241 పీపీవో ఆర్డర్స్‌ను రా మగుండం–3, అడ్రియాల ప్రాజెక్ట్‌ ఏరియా జీ ఎం నాగేశ్వరరావుకు అందజేశారు. గోవర్ధన్‌ మాట్లాడుతూ, సీఎంపీఎఫ్‌ లావాదేవీలన్నీ సీ– కేర్స్‌ పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయన్నారు. పర్సనల్‌ విభాగాధిపతి సుదర్శనం, డీవైపీఎం సునీల్‌ప్రసాద్‌, సీనియర్‌ పీవో రాజేశం, ఫైనా న్స్‌ అధికారి భరత్‌, సీఎంపీఎఫ్‌ సిబ్బంది కామే శ్వరరావు, లలిత, అనిత, మనోహర్‌ ఉన్నారు.

ఏపీపీగా వెంకటసాంబమూర్తి

పెద్దపల్లి: సీనియర్‌ సివిల్‌ జడ్జి, అసిస్టెంట్‌ సెషన్స్‌ కో ర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌(ఏపీపీ)గా సీనియర్‌ నాయ్యవాది దూడం వెంకటసాంబమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. ప్రభుత్వం తరఫున క్రిమినల్‌ కేసులు వాదించనున్నారు. ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణకు అనుగుణంగా న్యాయపరమైన వ్యవహారాల్లో చర్యలు చేపడతారు.

విద్యుత్‌ అధికారుల పట్టణబాట

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): లంబాడితండాలో విద్యుత్‌ అధికారులు సిబ్బందితో కలి సి మంగళవారం పట్టణబాట చేపట్టారు. ప్రజలతో మాట్లాడి విద్యుత్‌ సమస్యలను అడిగి తె లుసుకున్నారు. లూస్‌వైర్లు, వంగిన విద్యుత్‌ స్తంభాలు, సమస్యాత్మక ట్రాన్స్‌ఫార్మర్లను గు ర్తించారు. వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చే స్తామని, మరికొన్నింటికి మరమ్మతు చేస్తామని ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఈ నారాయణ, ఫోర్‌మెన్‌ చాంధ్‌పాషా, నరేందర్‌, రాములు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ లింగారెడ్డి, ఏఎల్‌ఎం శివసంతోష్‌, అశోక్‌, సుధాకర్‌, మాజీ కార్పొరేటర్‌ శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వివరాలు నమోదు చేయాలి

పెద్దపల్లి: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చే యాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ సూ చించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డ యాగ్నొస్టిక్‌ కేంద్రాల సిబ్బందితో పట్టణంలో మంగళవారం సమావేశమయ్యారు. ఇంటిగ్రేటె డ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై అవగాహన కల్పించారు. ఓపీ, వ్యాధి నిర్ధారణ కేసులు, ఎ పిడెమిక్‌కు కారణమయ్యే వ్యాధుల వివరాలను తప్పకుండా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రాం అధి కారి శ్రీరాములు, ఎపిడమియాలోజిస్ట్‌ నరేశ్‌, డిస్ట్రిక్ట్‌ డాటా మేనేజర్‌ మహేందర్‌ ఉన్నారు.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

పెద్దపల్లి: జిల్లాలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షల హాల్‌టికెట్లను www.bse.telangan a.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డీఈవో శారద తెలిపారు. జిల్లా, ట్రేడ్‌, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుందని పేర్కొన్నారు.

అంగారక చతుర్థి వేడుకలు 1
1/4

అంగారక చతుర్థి వేడుకలు

అంగారక చతుర్థి వేడుకలు 2
2/4

అంగారక చతుర్థి వేడుకలు

అంగారక చతుర్థి వేడుకలు 3
3/4

అంగారక చతుర్థి వేడుకలు

అంగారక చతుర్థి వేడుకలు 4
4/4

అంగారక చతుర్థి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement