క్యాథ్‌ల్యాబ్ ప్రారంభించాలి
గోదావరిఖని: ప్రజావస రాలకు అనుగుణంగా వై ద్యసేవలు అందించేందు కు మరిన్ని నిధులు కేటా యించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రూ.140 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఆయన అన్నారు. రూ.20 కోట్లతో నిర్మించిన క్యాథ్‌ల్యాబ్‌ను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులను ఎమ్మెల్యే కోరారు. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యంతో గుండెపోటు మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని, వాటి నియంత్రణకు అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు.
నాంసానిపల్లె జీపీవో సస్పెన్షన్
పెద్దపల్లి/ఓదెల: జిల్లాలోని ఓదెల మండలం నాంసానిపల్లె జీపీవో(గ్రామ పరిపాలనాధికారి) సకినారపు మొగిలిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర సమయాల్లో విధులకు జీపీవో హాజరుకాలేదని పేర్కొన్నారు. అధికారుల ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదని తహసీల్దార్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యేంతవరకు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించారు.


