ఉచితంగా వైద్య సేవలు
కుష్ఠు బాధితులకు వైద్యపరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందిస్తాం. శరీరంపై తెల్లని స్పర్శలేని, పాలిపోయిన మచ్చలు ఉంటే వ్యాధిగ్రస్తులుగా గుర్తిస్తారు. మొద్దుబారిన మచ్చలు, చేతివేళ్లు వంగడం, మచ్చలపై వెంట్రుకలు ఊడిపోవడం, చెమట రాకపోవడం, పాదాల్లో పుండ్లు తదితర లక్షణాలు ఉంటే అనుమానితులుగా గుర్తిస్తారు. శరీరంపై 5 కన్నా ఎక్కువ మచ్చలు ఉంటే 6 నెలలపాటు, అంతకన్నా ఎక్కువగా ఉంటే 12 నెలల పాటు ఉచితంగా మందులు అందిస్తారు.
– సుధాకర్‌రెడ్డి, పీవో, లెప్రసీ


