17 నుంచి సీఎం కప్–2026 పోటీలు
పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు సీఎం కప్–2026 పోటీల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రపంచచాపియన్ నినాదంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాలుగు దశల్లో పోటీలు చేపట్టింది. ఈమేరకు డీవైఎస్‌వో సురేశ్ షెడ్యూల్ విడుదల చేశారు.
8న క్రీడాజ్యోతి ర్యాలీ
సీఎం కప్ – 2026 పోటీలను ఈ నెల 8న క్రీడాజ్యోతి ర్యాలీతో ప్రా రంభిస్తారు. గ్రామస్థాయిలో ఈనె ల 17 నుంచి 22 వరకు, మండలస్థాయి ఈనెల 28 నుంచి 31 వరకు, అసెంబ్లీ ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు పోటీలు నిర్వహిస్తారు.
ఆసక్తి గలవారి కోసం వెబ్‌సైట్..
ఆసక్తి గలక్రీడాకారులు వెబ్‌సెట్‌లో తమ వివరాలు https:/satg.telangana.gov.in/cmcup/ వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవాలి. మిగతా వివరాల కోసం 99639 60063 నంబరులో సంప్రదించాలి.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో పోటీలు


