25 నుంచి మేడారానికి బస్సులు
గోదావరిఖనిటౌన్: మేడారం మహాజాతరపై స్థానిక ఆర్‌టీసీ డిపోలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు సిబ్బందితో మంగళవారం సమీక్షించారు. ఈనెల 25వ తేదీ నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ బ స్సులు నడుపుతామని అన్నారు. ఉద్యోగులు అంకి త భావంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ ఆర్‌ఎం(ఆపరేషన్) భూపతిరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎం(మెకానికల్) మల్లేశం, ఖని డిపో మేనేజర్ నాగభూషణం, అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్) గీతాకృష్ణ, అసిస్టెంట్ ఇంజినీర్(మెకానికల్) సంధ్యారాణి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ రవీందర్‌రెడ్డి, పద్మావతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


