సైబర్ నేరాలపై అప్రమత్తం
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరాలు, ఆన్‌లైన్, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, డిజిటల్ లావాదేవీల ని ర్వహణ సందర్భంగా అప్రమత్తంగా ఉండాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ ఎ స్పీ(సైబర్‌క్రైం) భిక్షంరెడ్డి సూచించారు. స్థానిక ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం ‘సై బర్‌క్రైం ఫ్రాడ్ కా ఫుల్‌స్టాఫ్’ అంశంపై అవగా హన కల్పించారు. ఆన్‌లైన్ లావాదేవీల సందర్భంగా అప్రమత్తంగా లేకుంటే మోసపోతారని అన్నారు. అధిక లాభాలు, పోలీసు అధికారులమని బెదిరించే కాల్స్‌పై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్‌క్రైం బారిన పడితే 1930 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏసీపీ కృష్ణ పాల్గొన్నారు.
13న జాబ్‌మేళా
పెద్దపల్లి: ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హతల తో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందు కు ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తామని జి ల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోని వీవీ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 90 ఖాళీలు ఉన్నాయని, వీటిని ఈ సందర్భంగా భర్తీ చేస్తారన్నారు. విద్యుత్ వాహనా ల విభాగంలో తొలుత ఉచితంగా శిక్షణ ఇస్తారని, ఆసక్తిగలవారు కలెక్టరేట్‌లోని రూమ్ నంబరు 233లో సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 77299 920 61, 92462 60743, 89853 36947, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని అన్నారు.
మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: మద్యం తాగి వాహ నం నడపవద్దని ఆర్టీవో రంగారావు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. సీట్‌బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అ న్నారు. ఈ సందర్భంగా ఐటీఐ మైదానం, మంథని క్రాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చే శారు. ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఉన్నారు.
అంధుల దినోత్సవం
పెద్దపల్లి: కలెక్టరేట్‌లోని డీడబ్ల్యూవో కార్యాలయంలో బుధవారం అంధుల దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. లూయిస్ బ్రెయిల్ జ యంతి సందర్భంగా ఈ వేడుకలు జరుపుకు న్నారు. డీడబ్ల్యూవో వేణుగోపాల్, అధికారులు రాజయ్య, కవిత, స్వర్ణలత పాల్గొన్నారు.
బడిలోకి కార్మికుల పిల్లలు
ధర్మారం(ధర్మపురి): పత్తిపాక సమీపంలోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా కార్మికుల పి ల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు నూతి మల్లన్న ఆధ్వర్యంలో బు ధవారం బడిలో చేర్పించారు. బడిబయట పి ల్లల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే సందర్భంగా ఏడుగురు బడిబయటి పిల్లలను గుర్తించినట్లు హెచ్‌ఎం పేర్కొన్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఎదుల్ల ప్రేమ్‌సాగర్, ఉపాధ్యాయులు శ్రీలత, శారద, సునీల్ అరుణశ్రీ పాల్గొన్నారు.
రోడ్లెక్కే కేజ్‌వీల్స్‌పై చర్యలు
సుల్తానాబాద్‌రూరల్: గ్రామీణ రోడ్లు నాగరికథకు చిహ్నాలని, ఇట్లాంటి వాటిపై కేఈజ్‌వీల్స్ ట్రాక్టర్లు వెళ్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అన్నారు. ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన అవగాహన కల్పించారు. రవాణా సౌక ర్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు రోడ్లు నిర్మిస్తున్నాయని, వాటిపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు వెళ్తే దెబ్బతింటాయని అన్నారు. మానేరు నుంచి ఇసుక అక్రమంగా తరలించినా చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం శాటిలైట్ సర్వీస్‌లైన్స్ నిఘా పెడతామని తెలిపారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ ఉన్నారు.
సీఎమ్మార్ అప్పగించాలి
పెద్దపల్లి: రైస్‌మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి ఫిబ్రవరి 28వ తేదీలో గా ప్రభుత్వానికి సీఎమ్మార్ అప్పగించాలని సి విల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఈమేరకు అధికారులు, మిల్లర్లతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమీక్షించారు.
క్వింటాల్ పత్తి రూ.7,451
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,451 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,162, సగటు రూ.7,216 ధర నమోదైంది.
సైబర్ నేరాలపై అప్రమత్తం


