శవాలు కుళ్లుతున్నాయ్..
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్షా, పెద్దపల్లి – కరీంనగర్ రైల్వేస్టేషన్ల మధ్య నిత్యం ఎక్కడో ఓచోట ఏదోఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. తెలంగాణ పరిధిలోని మంచిర్యాల, కా జీపేటలో తప్ప ఈ మార్గంలో మరెఎక్కడా రైల్వే పో లీస్‌స్టేషన్లు లేవు. రామగుండంలో పోలీస్ అవుట్ ఉ న్నా.. ప్రమాదం, చోరీలు, అనూహ్య ఘటనలు చో టుచేసుకుంటే వందలాది కిలోమీటర్లు వెళ్లడం, విచారణ జరపడం, సాయం చేయడం రైల్వేపోలీసులు, సిబ్బందికి తలకుమించిన భారంగా మారుతోంది.
దూరభారం..
రామగుండం నుంచి ఉప్పల్ వరకు 11, పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు 7 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రామగుండం పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలో 18 రైల్వేస్టేషన్లు ఉండగా.. సుమారు 160 కి.మీ. మేర.. ఆయా ప్రాంతాల్లో ఏ ఘటన చోటుచేసుకున్నా అక్కడకు వెళ్లిరావడం సిబ్బందికి ఇబ్బందిగా ఉంటోంది. ప్రస్తుతం రామగుండంలో రైల్వే అవుట్ పోస్ట్ ఉంది. మంచిర్యాలలో రైల్వే పోలీస్‌స్టేషన్ ఉంది. వీటి పరిధిలో మొత్తం 30 రైల్వేస్టేషన్లు ఉండగా.. దాదాపు 260 కి.మీ. మేర ఒక ఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సీఐ, డీఎస్పీస్థాయి అధికారులు కాజీపేట రైల్వేపోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒక్కరే హెడ్‌కానిస్టేబుల్..
రామగుండం రైల్వే పోలీస్ అవుట్ పోస్ట్‌లోని ఒక హెడ్‌కానిస్టేబుల్ ఉప్పల్ నుంచి రామగుండం వరకు, పెద్దపల్లి నుంచి కరీంనగర్, జగిత్యాల వరకు నిత్యం పనిచేస్తున్నారు. మంచిర్యాల రైల్వే ఎస్సై మహేందర్.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి కరీంనగర్, జగిత్యాల, రామగుండం, ఉప్పల్ వరకు ఏ ఘటన జరిగినా పర్యవేక్షణ, విచారణ చేస్తున్నారు. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన పెద్దపల్లి జంక్షన్‌తోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ రైల్వేస్టేషన్‌లోనూ రైల్వే పోలీస్‌స్టేషన్లు ఇంకా ఏర్పాటు చేయడంలేదు.
తప్పని నరకయాతన..
రైళ్ల నుంచిపడి మృతిచెందితే.. ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకునేందుకే కనీసం ఒకరోజు సమయం పడుతోంది. మృతుల సమాచారం, వివరాలు సేకరించడం, ఆ తర్వాత గమ్యస్థానానికి చేరుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈలోగా శవాలు కుళ్లిపోతున్నాయి. దీంతో మృతుల వివరాలు తెలియగంలేదు. వారి కుటుంబాల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.
ఎముకలే మిగులుతున్నాయి..
రైళ్లనుంచి తోసేసిన సందర్భాలు కూడా ఈ మార్గంలో అనేకం నమోదయ్యాయి. అయితే, సిబ్బంది కొరత, దూరభారం కావడంతో కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. తద్వారా మృతుల కుటుంబాలకు న్యాయం అందడంలేదు. వివిధ కారణాలతో శవాలు రైలుపట్టాలపై కుళ్లిపోయి ఉండడంతో సిబ్బంది వచ్చేవరకు ఎముకలే మిగులుతున్నాయి. దీంతో రైల్వే సిబ్బంది అక్కడ మిగిలిన మృతుల తాలూకు దుస్తులను ఆధారాలుగా స్వీకరిస్తూ ఎముకలను పూడ్చిపెడుతున్నారు. అనుమానాస్పద మృతి, తోసేసిన ఘటనల్లో దోషులు, కారణాలు తెలుసుకోవడం సిబ్బందికి కత్తిమీద సాముగా మారుతోంది. అంతేకాదు.. చాలా కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా అవసరమైన చోట్ల కొత్త రైల్వేపోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మంచిర్యాల, కాజీపేటలో తప్ప మరెక్కడాలేని రైల్వే పోలీస్‌స్టేషన్‌లు
రామగుండం అవుట్‌పోస్ట్‌లో ఒకేఒక హెడ్‌కానిస్టేబుల్
శవాలు కుళ్లుతున్నాయ్..
శవాలు కుళ్లుతున్నాయ్..
శవాలు కుళ్లుతున్నాయ్..


