ఆశచూపి.. అందినకాడికి దండుకుని..
● సైబర్ నేరగాళ్ల వలలో అందుగులపల్లి యువకుడు
● రూ.93వేలు పోగొట్టుకున్న వైనం
● సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్లు విసిరన వల తో అత్యాశకు పోయిన పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ యువ వి ద్యార్థి పలు దఫాలుగా రూ.93 వేలు పోగొట్టుకున్నాడు. ఈవిషయం (డిసెంబర్ 31న జరిగింది) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్‌లో వచ్చిన ఓ లింక్‌ను ఓపెన్ చేయగా.. రూ.వెయ్యి పంపితే 30 శాతం అదనంగా రూ. 1,300 ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆశ చూపా రు. వెంటనే రూ.వెయ్యి పంపగా రూ.1,300 తిరిగి వచ్చింది. దీంతో మూడుసార్లు మళ్లీ నగ దు పంపించాడు. మూడోసారి పంపిన రూ.3వేలను రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకున్నామని, ఇప్పుడు ఓ టాస్క్ ఇస్తున్నామని సైబర్ నేరగాళ్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రూ.ప్రతీ టాస్క్‌కు రూ.15వేలు చెల్లించాలని అందులో గెలిస్తే రూ.లక్ష ఇస్తామంటూ ఆశచూపారు. దీంతో బంధువులు, మిత్రుల ద్వారా డబ్బు తీసుకుని అందులో పాల్గొన్నాడు. టాస్క్‌లో అడిగిన సులువైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా మరోసారి రూ.30వేలు, మూడోసారి రూ.45వేలు చెల్లించి పాల్గొన్నా డబ్బు రాకపోగా వారినుంచి ఎలాంటి మెసేజ్ లేదు. దీంతోక తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
యువకుడి ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): రాత్రివరకూ మద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవారు ఏమనుకుంటారని తండ్రి మందించినందుకు మనస్తాపం చెందిన బైరి నరేశ్(25) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రాత్రివరకూ మ ద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవాళ్లు ఏమనుకుంటారని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన నరేశ్.. ఇంట్లోని గడ్డిమందు తాగి వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి పెద్దకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గంజాయి పట్టివేత
కోరుట్లటౌన్: పట్టణంలోని మాదాపూర్ రోడ్ క్రాసింగ్ వద్ద పోలీసులు బుధవారం రాత్రి తని ఖీలు చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు 50 గ్రాము ల గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మాదాపూర్ కాలనీకి చెందిన బిల్లికర్ దేవిశ్రీప్రసాద్, భీమునిదుబ్బకు చెందిన ఏనుగుల రాజేశ్ వ్యసనాలకు అలవాటు పడి గంజాయి తెచ్చి యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.


