రామగుండం చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు | - | Sakshi
Sakshi News home page

రామగుండం చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

Jan 8 2026 9:32 AM | Updated on Jan 8 2026 9:32 AM

రామగుండం చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

రామగుండం చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

కోల్‌సిటీ(రామగుండం): మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. తాజాగా రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన బ్యాలెట్‌ బాక్స్‌ల ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల కోసం ఉపయోగించిన సుమారు 628 బ్యాలెట్‌ బాక్సులను పెద్దపల్లిలో భద్రపరిచిన ఓ గోదాం నుంచి బుధవారం రాత్రి రామగుండం బల్దియాకు తరలించారు. వీనిని సురక్షితంగా నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఒకహాల్‌ కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోపు అన్నిఏర్పాట్లు పూర్తిచేసేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement