మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందే
● బీజేపీ నేతల డిమాండ్
పెద్దపల్లిరూరల్: పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేనని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలనే డిమాండ్‌తో పార్టీ పట్టణఅధ్యక్షుడు రాకేశ్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. ట్రాఫిక్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పార్కింగ్ స్థలాలు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాల్వల ఆక్రమణ లాంటి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చిలారపు పర్వతాలు, ఠాకూర్ రాంసింగ్, పల్లె సదానందం డిమాండ్ చేశారు. నాయకులు తిరుపతి, ఈర్ల శంకర్, శ్రీనివాసరావు, కావేటి రాజగోపాల్, మహంతకృష్ణ, శ్రీకాంత్, ఫహీం, ఉప్పుకిరణ్, సత్యనారాయణ, గుడ్ల సతీశ్, సురేందర్‌కుమార్, వినయ్, శివయ్య, సోడాబాబు, శ్రీధర్, రాజేశ్, కరుణాకర్, మధుకర్, అంజి, ఆనందరావు, సాయి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు పనుల్లో వేగం
జూలపల్లి(పెద్దపల్లి): సోలార్ పవర్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశించారు. కాచాపూర్ మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. భూసేకరణలో ఇబ్బందులు, పనుల నిర్వహణపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్‌రావు, సీఈ సురేందర్, ఎస్‌ఈ గంగాధర్, డీఈఈ రాజబ్రహ్మచారి, ఈఈ శ్రీనివాస్, ఏడీఈ విజయ్‌గోపాల్‌సింగ్, ఏడీఈ సత్యనారాయణ, తహసీల్దార్ వనజ పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందే


