అభివృద్ధి.. ఆలస్యం
మంథని: రాష్ట్రంలోని సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో మంథని పట్టణాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ని యోజకవర్గ రూపరేఖలు మార్చేలా మంథని అభి వృద్ధి నిధులు వరదలా మంజూరవుతున్నాయి. కానీ, ఏడాదిన్నర గడిచినా పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. వివిధ శాఖల అధికారుల ఆలసత్వ మో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ప్రగతి పనులు ఇంకా ముందుకు సాగడమే లేదు.
ప్రారంభంకాని పనులు..
మంథని సమీపంలోని గోదావరి నదిపై మంచిర్యాల జిల్లా శివ్వారం వరకు రూ.125 కోట్ల అంచనాలతో హైలెవల్ వంతెన నిర్మాణానికి 2024 డిసెంబర్‌లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సభ ప్రాంగణంలోనే శంకుస్థాపన చేసారు. అనుమతులు, పరీక్షల పేరిట కాలయాపన జరుగుతోంది. దీంతో పనులు ప్రారంభమే కాలేదు. వంతెనకు అనుసంధానంగా మంథని శివారులో రూ.165 కో ట్ల అంచనాలతో చేపట్టే శ్రీపాదమార్గ్(బైపాస్ రో డ్డు)కు అవసరమైన భూసేకరణ కోసం 15 రోజుల క్రితమే నోటీస్‌లు జారీచేశారు.
తరచూ సమీక్షిస్తున్నా..
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని మంత్రి డి.శ్రీధర్‌బాబుతో జిల్లాస్థాయి అధికారులు పలుమార్లు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ పలుమార్లు పర్యవేక్షిస్తున్నా ఆశించినస్థాయిలో అభివృద్ధి పనులు సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అనుమతుల్లో ఆలస్యం
మంథని ప్రాంతానికి మంజూరైన అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతులు సకాలంలో రావడంలేదు. భూ సేకరణలోనూ ఆలస్యం అవుతోంది. విడతల వారీగా వస్తున్న అనుమతుల ఆధారంగా పనులు చేపడుతున్నాం. అందుకే ఆలస్యమవుతోంది.
– జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని
ఏడాది గడిచినా ప్రారంభంకాని పనులు రూ.కోట్లు మంజూరైనా తప్పని అవస్థలు
అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ప్రజల ఆగ్రహం మంథనిలో ప్రగతి పనుల తీరు
అమృత్ 2.0 ప్యాకేజీ–1 ద్వారా రూ.12.10 కోట్ల అంచనాలతో మంథనిలోని పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంక్ పనులకు 2024 జూలై 15న శంకుస్థాపన చేశారు. ఆర్నెల్లలో పనులు పూర్తిచేసి పురవాసులకు తాగునీరు సరఫరా చేస్తామని అప్పట్లోనే చెప్పారు. ఏడాదిన్నర కావొస్తున్నా పనులు పునాదులు దాటడంలేదు.
అభివృద్ధి.. ఆలస్యం
అభివృద్ధి.. ఆలస్యం
అభివృద్ధి.. ఆలస్యం


