మాచర్ల: రాష్ట్రంలో అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అందర్నీ అణగదొక్కుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నందున ప్రతి కార్యకర్తతో పార్టీ నాయకత్వం అనుసంధానం అయ్యేలా జగన్ 2.0 యాప్‌ను మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. శుక్రవారం మాచర్లలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఆయన యాప్ పోస్టర్ ఆవిష్కరించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా రాజకీయాలు చేస్తూ తమ పార్టీ వారిపై కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ కంటెంట్‌ను డిలీట్ చేసి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలోనే జగన్ 2.0 యాప్‌ను ఆవిష్కరించారన్నారు. అందర్నీ చైతన్యపరచి ఈ యాప్‌లో భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, పల్లపాటి గురుబ్రహ్మం, బోయ రఘురామిరెడ్డి, అబ్దుల్ జలీల్, బూడిద శ్రీను, పోతురెడ్డి కోటిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, షేక్ మస్తాన్, పిల్లి కొండలు, బూదాల మరియమ్మ, అల్లి జీవన్, మైనార్టీ నాయకులు అబ్దుల్ సత్తార్, చికెన్ బాజి, నాయకులు మోరా రామకృష్ణారెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, కొండా శివలింగరాజు, ఇంద్ర గౌడ్, బాలమ్మ, అనంతరావమ్మ, కారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చిన్న బద్రు, దుర్గ, డేగ శివ, వేల్పుల గురవయ్య, కొమ్ము వెంకటేశ్వర్లు (బొంగురు), పులిమెల మాణిక్యం, సభావత్ రవినాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వై. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదీ..
గూగుల్ ప్లే స్టోర్‌లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని టైపు చేయగానే వైఎస్ జగన్ చిత్రంతో కూడిన యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం సెల్ నంబరు, ఓటీపీ నమోదు చేయాలి. యాప్ వినియోగించే వారి పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవచ్చు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


