మద్యం మత్తులో విద్యార్థులపై దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

Jun 29 2023 12:18 AM | Updated on Jun 29 2023 10:48 AM

చికిత్స పొందుతున్న విద్యార్థులు  - Sakshi

చికిత్స పొందుతున్న విద్యార్థులు

వర్ని: వర్నిలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ క్రీడా మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థులపై మోహన్‌ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. బుధవారం ఉదయం ఎస్సీ హాస్టల్లో భోజనం ముగించుకొని పక్కనే ఉన్న జిల్లా పరిషత్‌ బాలుర హై స్కూల్‌ క్రీడామైదానంలో క్రికెట్‌ విద్యార్థులు క్రికెట్‌ ఆడటానికి వెల్లారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మోహన్‌ మద్యం మత్తులో విద్యార్థులతో గొడవపడి కర్రతో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో 12 మంది హాస్టల్‌ విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైస్కూల్‌ ఉపాధ్యాయులు గాయపడిన విద్యార్థులను వర్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో మోహన్‌ తాను క్రికెట్‌ ఆడుతానని గొడవపడినట్లు బాధిత విద్యార్థులు వెల్లడించారు. హాస్టల్‌ వార్డెన్‌ పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రుద్రురు సీఐ జాన్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement