రైతు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి! | - | Sakshi
Sakshi News home page

రైతు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి!

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

జిల్లాలో పట్టాపాస్‌పుస్తకాలు ఉన్న రైతులు

2,92,639

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకున్న వారు

2,38,426

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వ్యవసాయ రంగంలో పారదర్శకత, అర్హులైన వారికే రాయితీలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు రిజిస్ట్రేషన్‌’ (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రక్రియ ఇప్పుడు మరింత కీలకంగా మారింది. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు వివరాలు ఆనన్‌లైన్‌లో నమోదై ఉండాలనే నిబంధన తెచ్చిన ప్రభుత్వం.. ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తప్పనిసరి చేసింది. ఇటీవల ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇకపై యూరియాతోపాటు డీఏపీ, పొటాష్‌ వంటి ఏ రకమైన రాయితీ ఎరువులు కావాలన్నా... యాప్‌లో రైతు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా లింక్‌ అయిన ఆధార్‌ నంబర్‌ నమోదు చేయడం తప్పనిసరి. ఆ వివరాలు సరిపోలితేనే రాయితీ ధరపై ఎరువులను కేటాయిస్తున్నారు. అయితే, కేవలం ఎరువుల కొనుగోలుకే పరిమితం కాకుండా.. ఈ ఫార్మర్‌ ఐడీని ఇతర కీలక ప్రభుత్వ పథకాలకు కూడా అనుసంధానిస్తున్నారు. పీఎం కిసాన్‌, పంటల కొనుగోలు (మద్దతు ధర), పంట పెట్టుబడి సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ నంబరే ప్రామాణికంగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా ఇంకా 54,213 మంది రైతులు తమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోలేదు. రానున్న రోజుల్లో ఎరువుల కొరత లేదా సాగుసాయం అందక ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వేలాది మంది రైతులు తక్షణమే స్పందించాల్సి ఉంది. అయితే, ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదుకాని రైతుల్లో కొందరు స్థానికంగా లేరని తెలుస్తోంది. మిగతా కొందరు అవగాహన లేక అలాగే ఉండిపోయారు. భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌రూరల్‌, నిజామాబాద్‌సౌత్‌ మండలాలు రైతు రిజిస్ట్రేషన్‌లో వెనుకబడ్డాయి. మిగతా మండలాలు 80.55 శాతం నుంచి 86.21శాతం వరకు పూర్తి చేశాయి.

రిజిసే్ట్రషన్‌ చేసుకోవాల్సిన వారు

54,213

(ఏఐతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం)

ఎరువుల కోసం..

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌కు లింక్‌

చేసిన కేంద్రం

మున్ముందు ఇతర పథకాలకూ

అనుసంధానం

జిల్లాలో ఇంకా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోని రైతులు 54,213 మంది..

తక్షణమే నమోదు చేసుకోవాలంటున్న వ్యవసాయాధికారులు

ఫార్మర్‌ ఐడీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంకా నమోదు చేసుకోని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) లేదా సమీప మీసేవ కేంద్రాలను సంప్రదించి, పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌ వివరాలు ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి.

– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement