కులబహిష్కరణ విధించడం నేరం. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. బాధితులు ఎవరైనా భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ఏసీపీ, బోధన్
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్‌లోకి వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 6,367 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.45 అడుగుల (11.838 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగితం వాగులో వరద ప్రవహిస్తోంది. మహమ్మద్‌నగర్ మండలం సింగితం గ్రామ రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 15 రోజులుగా వాగులో వరద కొనసాగుతుండగా, వాగు దాటేందుకు తెప్పలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుకు రెండు వైపులా తాడుకట్టి తెప్పపైన ప్రయాణిస్తున్నారు. వాగుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతోనే తెప్ప కష్టాలు తప్పడం లేదని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెప్పపై సింగితం వాగు దాటుతున్న రైతులు, కూలీలు


