కుటుంబానికి భరోసా ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

కుటుంబానికి భరోసా ఉద్యోగం

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ ఉంది

సరైన వేదికనే జాబ్‌మేళా

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌

సుభాష్‌నగర్‌: ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారి ప్రతిభకు తగిన విధంగా అవకాశాలు కల్పించాలనే మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశామని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో ఆదివారం మెగా జాబ్‌ మేళా నిర్వహించగా.. సుమారు రెండున్నరవేల మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆయా కంపెనీలో ఎంపికై న అభ్యర్థులకు ఎమ్మెల్యేతోపాటు సీపీ సాయిచైతన్య కాల్‌ లెటర్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ధన్‌పాల్‌ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కాదని, ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం అని పేర్కొన్నారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చామని అన్నారు. నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు.

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే..

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్‌ యువత అదృష్టమని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అన్నారు. భారీ జాబ్‌ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయంతోపాటు ప్రజల అభివృద్ధికి పాటుపడే వారు అరుదుగా ఉంటారన్నారు. మేయర్‌ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్‌ శశాంక్‌, మఠం పవన్‌, శ్రవణ్‌, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం సుధీర్‌, జగదీశ్‌ కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement