సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సాంకేతిక పరిజ్ఙానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలోనూ కుల కట్టుబాట్లతో పేరుతో తోటి మనుషులతో అ మానుషంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని కులాల్లో పెద్దల ఆగడాలు కొనసాగుతూనే ఉ న్నాయి. జిల్లాలోని మోస్రా మండలకేంద్రానికి చెందిన గుమ్ముల పోశెట్టి కుటుంబం సుమారు ఏడాది కాలంగా కుల బహిష్కరణను ఎదుర్కొంటోంది. పోశెట్టి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించా మని, వారి కుటుంబ సభ్యులను ఎవరైనా పలకరించినా, సహాయం చేసినా, వారితో పొలం పనులు చే యించుకున్నా జరిమానా విధిస్తామని కుల పెద్దలు ప్రకటించారు. ఆ కుటుంబంతో మాట్లాడిన వారిని సైతం బహిష్కరించడం, జరిమానాలు విధించడం యథేచ్ఛగా అమలుచేస్తున్నారు.
ప్రత్యక్షంగా హాజరుకాలేదని..
గుమ్ముల పోశెట్టి(63) గతంలో సుమారు 18 ఏళ్ల పాటు రెడ్డిక కుల సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగారు. గ్రామంలో కుల సంఘం భవనం నిర్మాణంతోపాటు సంఘం బలోపేతానికి పనిచేశారు. గతే డాది తలలో రక్తం గడ్డకట్టి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. కులసంఘం ఏర్పా టు చేసిన సమావేశాలకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. గతేడాది వనభోజనాల సందర్భంగా కులసంఘం ఆధ్వర్యంలో మాంసం పంపిణీకి పోశెట్టి బదులుగా ఆయన కుమారుడు మహేశ్ వచ్చాడని కుల పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఆ యన తండ్రి స్వయంగా రావాలని పట్టుబడుతూ త మ మాట వినడం లేదని పోశెట్టి కుటుంబాన్ని బహిష్కరిస్తూ కులసభ్యుల ఎదుట ప్రకటించారు. ఘట న తర్వాత పోశెట్టి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా వారి నుంచి స్పందన కరువైంది.
పలకరించిన పాపానికి కులం బంద్
పోశెట్టి కుటుంబ సభ్యులతో కులస్తులు ఎవరూ మా ట్లాడవద్దని, పలకరించినా, ఆ కుటుంబ సభ్యులతో పొలం పనులు చేయించుకున్నా వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడినందుకు, బాధి త కుటుంబం వెంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినందుకు కంచర సాయిలు కుటుంబాన్ని సైతం కుల పెద్దలు బహిష్కరించారు.
ఇప్పటికే ఈ కుటుంబంతో మా ట్లాడినందుకు ఒకరు రూ. 5వేలు, వీరి ద్వారా పొ లం పనులు చేయించుకున్న కారణానికి మరొకరు రూ. 12 వేలు జరిమానా చెల్లించుకున్నారు. ఇలాంటి వేధింపులతో గ్రామంలోని కులస్తులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని, కులస్తుల శుభకార్యాలు, పెళ్లిళ్లకు, పలకరింపులకు దూరమయ్యామని మనో వేదన చెందుతున్నారు.
● ఈ ఫొటోలో దండం పెట్టి వేడుకుంటున్న వారు జిల్లాలోని మోస్రా మండలకేంద్రానికి చెందిన గుమ్ముల పోశెట్టి, కంచర సాయిలు. రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరి కుటుంబాలను కులపెద్దలు బహిష్కరించారు. వారితో కులస్తులు ఎవరూ మాట్లాడొద్దని, వారికి సహాయం చేసినా, పనికి పిలిచినా వారిని సైతం బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆ రెండు కుటుంబాలతో మాట్లాడిన వారికి సైతం జరిమానాలు విధిస్తున్నారు. సామాజిక కుల బహిష్కరణను ఎదుర్కొంటున్న ఆ రెండు కుటుంబాలు తీవ్ర మనోవేదననుకు గురవుతున్నాయి.
కుల సంఘం మాజీ అధ్యక్షుడి కుటుంబాన్ని
బహిష్కరించిన కుల పెద్దలు
ఆ కుటుంబంతో మాట్లాడితే
రూ.10 వేల జరిమానా
పనికి పిలిచినా.. పలకరించినా
జరిమానాలు, బహిష్కరణలు
కులం బంద్ ఆదేశంతో మనోవేదనలో బాధిత కుటుంబం
జిల్లాలో పలుచోట్ల కొనసాగుతున్న
కులపెద్దల ఆగడాలు


