ఆహ్లాదమా.. అదెక్కడ? | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదమా.. అదెక్కడ?

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

● జిల్లాలో పార్కుల్లేవు.. ప్లే గ్రౌండ్లూ లేవు ● చుట్టూ గొలుసుకట్టు చెరువులు.. ● కనీసం బోటింగ్‌ సౌకర్యం కూడా లేదు ● హాలీడేస్‌ వస్తే.. జిల్లా దాటాల్సిందే

నిర్మల్‌: జిల్లా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా ప్రజలకు ఆహ్లాదం పంచే విషయంలో మాత్రం చాలా వెనుకంజలో ఉంది. కనీసం హాలీడేస్‌లో కుటుంబంతో కాసింత సేదతీరేందుకు సరైన పా ర్కులు లేక.. పిల్లలు ఆడుకునేందుకు మైదానా లు కనిపించక.. యువతకు క్రీడా వసతులు అంతంత మాత్రంగానే ఉండటంతో వారాంతాల్లోనూ జిల్లావాసులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక సమగ్ర వినోద, క్రీడా ప్రాంగణం లేకపోవడం జిల్లాలో ప్రధాన సమస్యగా మారింది.

బోటింగ్‌ ఏదీ..?

నిర్మల్‌ చుట్టూ అనేక చెరువులు, కుంటలు ఉన్నా యి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో మాత్రం ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. కనీసం ఒకటి, రెండు చెరువులను ఎంపిక చేసి శుద్ధి చేసి.. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, గ్రీనరీ, పిల్లల ఆటస్థలం, కూర్చునే ప్రదేశాలు ఏ ర్పాటు చేసి బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ప్రజలకు ఆహ్లాదంతోపాటు స్థానికంగా పర్యాటక ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది.

ఆహ్లాదం కోసం వెతుకులాట

కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు అనువైన పార్కులు కూడా లేవు. ఉన్న ఒకట్రెండు కూడా అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, వసతుల విషయంలో ప్రజలు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఆట పరికరాలు, వృద్ధులకు వాకింగ్‌ ట్రాక్‌లు, మహిళలకు సురక్షితమైన కూర్చునే ప్రదేశాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక పార్కులు అవసరమని పట్టణవాసులు కోరుతున్నారు.

ఆటస్థలాలకూ కొరత..

పిల్లలు, యువతకు క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ జిల్లాలో ఇప్పటికీ సరైన మైదానాలు లేవు. ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ వంటి క్రీడలు ఆడేందుకు పిల్లలు, యువత ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రతి ప్రధాన ప్రాంతంలో ఒక క్రీడా మైదానం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలూ కనుమరుగయ్యాయి.

జిల్లాకేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలు

అభివృద్ధిలో ‘ఆహ్లాదం’ ఉండాలి..

అభివృద్ధి అంటే రహదారులు, భవనాలు మా త్రమే కాదని జిల్లావాసులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి పచ్చదనం, పా ర్కులు, క్రీడా మైదానాలు, సరస్సుల అభివృద్ధి కూడా అవసరమే. చెరువులను పరిరక్షిస్తూ వాటి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, గ్రీన్‌ బెల్ట్‌, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేసి.. వీలైన చోట్ల బోటింగ్‌ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స మగ్ర ప్రణాళిక రూపొందించి.. ఉన్న వనరులను సద్వినియోగం చేస్తే ‘ఆహ్లాదకర నిర్మల్‌’కు బాటలు పడతాయని అంటున్నారు.

హాలీడేస్‌లో జిల్లా దాటాల్సిందే..

సెలవురోజు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలంటే స్థానికంగా కనీసం అభివృద్ధి చేసిన పర్యాటక ప్రాంతాలూ లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లావాసులు ఇతర జిల్లాలు, పట్టణాల వైపు వెళ్లాల్సి వస్తోంది. పిల్లలకు వినోదం, పెద్దలకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కరోజు విహారానికి కూడా ప్రయాణం తప్పడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement