యువత చేతిలో దేశ భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

యువత చేతిలో దేశ భవిష్యత్తు

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని సరస్వతీ విద్యాపీఠం దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ నిర్మల్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం హిందూ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానవక్త సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ యువత చదువు కుటుంబంతోపాటు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. యువత ఆర్‌ఎస్‌ఎస్‌లో పాల్గొని దేశం కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి భీమ్లా అక్షయ్‌, ప్రత్యేక అతిథి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, నూకల విజయ్‌కుమార్‌, అరవింద్‌, శివకుమార్‌, బొబ్బిలి అశోక్‌, మాజీ కౌన్సిలర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement