దశాబ్దాల చరిత్ర | - | Sakshi
Sakshi News home page

దశాబ్దాల చరిత్ర

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లోని దేవీచంద్‌ చౌక్‌లో జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1952లో ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు దేవీచంద్‌ మిట్టల్‌, హరిరామ్‌ బగాడియా, గంధె యాదవ్‌రావు, రధిరామ్‌ రిచ్‌పాల్‌, ఓంకార్మల్‌ మఖారియా తదితరులు కలిసి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్స్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవీచంద్‌ మిట్టల్‌, పూల్చంద్‌ అగర్వాల్‌ వంటి ప్రముఖ వ్యాపారవేత్తల చేతుల మీదుగా తొలిసారిగా ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని దేవీచంద్‌ చౌక్‌గా పిలుస్తున్నారని చాంబర్‌ అధ్యక్షుడు దినేష్‌ మాటోలియా తెలిపారు. దశాబ్దాలుగా ప్రతీ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాంబర్‌ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement