వీధుల్లో వందేమాతరం నినాదాలు | - | Sakshi
Sakshi News home page

వీధుల్లో వందేమాతరం నినాదాలు

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

మంచిర్యాలఅర్బన్‌: ప్రస్తుత కాలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భారీ వేదికలు, మైకులు, విద్యుత్‌ కాంతులతో సాగుతున్నప్పటికీ నాటి రోజుల్లో కనిపించే దేశభక్తి, నిరాడంబరత కొంతమేర కొరవడ్డాయి. అప్పట్లో తెలంగాణ గ్రామాల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే అత్యంత పవిత్రమైన దేశభక్తి భావంతో జెండా ఎగురవేశాం. గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలల వద్ద హెడ్మాస్టర్లు, పెద్దల ఆధ్వర్యంలో ఊరంతా ఏకమై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేవారు. గ్రామస్తులు, యువకులందరూ చేతుల్లో త్రివర్ణపతాకాలు పట్టుకుని వీధుల్లో వందేమాతరం అంటూ నినాదాలు చేశాం. స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ చేసే ప్రసంగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా

ఉండేవి.

– విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తవడ్ల రామయ్య(88), మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement