పరాయి రాజుల పేర్లతో ఉన్న నాణేల నుంచి స్వాతంత్య్రం సిద్ధించాక అశోక స్తంభం, మూడు సింహాల చిహ్నాలతో మన స్వతంత్ర భారత నాణేలు ఎలా రూపుదిద్దుకున్నాయో భావితరాలకు తెలియజేయాలన్నదే నా లక్ష్యం. స్వాతంత్య్రం కోసం మన పూర్వీకుల త్యాగాలు, పరాయి పాలనలో మన దేశం అనుభవించిన బానిసత్వ ఛాయలను తెలియజేయడమే నా ఉద్దేశం. ఈ నాణేలను చూసినప్పుడు మనకు లభించిన స్వాతంత్య్రం విలువ, స్వయం పాలన గొప్పదనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అందుకే పాఠశాలలకు వెళ్లి నాణేలను విద్యార్థులకు చూపి వివరిస్తూ ఉంటాను.
– బాశెట్టి రాజ్‌కుమార్


