నిర్మల్‌ఖిల్లా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రాష్ట్రం నుంచి నామినేట్ అయిన ఆరుగురిలో నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి జాతీయ జ్యూరీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎల్లన్న పాల్గొన్నారు. తన 18 ఏళ్ల ప్రస్థానంలో చేపట్టిన వినూత్న బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యసనాభివృద్ధి కోసం నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, జేడీ వెంకట నర్సమ్మ, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, విశ్వనాథం గుప్తా తదితరులు ఎల్లన్నను అభినందించారు.


