తిరంగా హోరు | - | Sakshi
Sakshi News home page

తిరంగా హోరు

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసాటౌన్‌: స్వాతంత్య్ర సంబు రాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు నిర్మల్‌, భైంసా పట్టణాల్లో గురువారం తిరంగా ర్యాలీలు నిర్వహించారు. పాఠశాల, కళా శాలల విద్యార్థులు, యువకులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని భారత్‌మాతాకీజై, వందేమాతరం నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీ తీశారు. మహనీయులను స్మరించుకున్నారు. నిర్మల్‌లో ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌక్‌, పాత బస్టాండ్‌ మీదుగా వివేక్‌ చౌక్‌ వరకు కొనసాగింది. అంబేడ్కర్‌, స్వామి వివేకానంద విగ్రహాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భైంసాలో పద్మావతి కాలనీలోని వెంకటేశ్వరాలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. ముందుగా గాంధీగంజ్‌ వద్ద గల గాంధీ విగ్రహా నికి ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌ పూలమాల వేశారు. అక్కడి నుంచి బస్టాండ్‌ ఎదురుగా గల అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం మనందరి బాధ్యతన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్‌ రాథోడ్‌, భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ తూముల దత్తాత్రి, నా యకులు రావుల రాంనాథ్‌, భూమయ్య, స్రవంతిరెడ్డి, తక్కల రమణారెడ్డి, కరిపే విలాస్‌, మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: బీడీ కార్మికులకు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూని యన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం బీడీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు పెన్ష న్‌ దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. ఉపాధ్యక్షుడు కట్ట రాజన్న మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతీ బీడీ కార్మికుడికి ఆసరా పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రామలక్ష్మణ్‌, జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న, జిల్లా కోశాధికారి గఫూర్‌, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, నాయకురాలు గోదావరి, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లై న్‌ నాయకుడు వి.మహేందర్‌ పాల్గొన్నారు.

పెన్షన్‌ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement