కడెం: మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాకేశ్ గురువారం సందర్శించారు. మందుల నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మండల కేంద్రంలోని తహసీ ల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. సెన్సన్‌లో భాగంగా జిల్లాలో కడెం, బాసర మేజర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారని, అందులో భాగంగా ఆయా గ్రామాల జీపీవోల ద్వారా ఆయా శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా గ్రామాల చారిత్రక అంశాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్‌ఐ శారద, జీపీవోలు ఉన్నారు.


