సీఎంఆర్‌ బకాయిలపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ బకాయిలపై చర్యలు తీసుకోవాలి

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను భారత ఆహార సంస్థకు సకాలంలో సరఫరా చేయడంతో పాటు, పెండింగ్‌ వివరాలు వెల్లడించి పారదర్శక చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర కిశోర్‌కుమార్‌కు గురువా రం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తన్న యా దవ్‌ మాట్లాడుతూ పెండింగ్‌ ఉన్న సీఎంఆర్‌ సరఫ రాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. మిల్లింగ్‌, రవాణా, నిల్వలో ఎదురవుతున్న ఆటంకా లు తొలగించాలన్నారు. సీఎంఆర్‌ పురోగతి జిల్లా వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సరఫరాలో ఆలస్యంతో ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం, దానికి కారణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రైతుల ప్రయోజ నా లు, ప్రజాధనం, ప్రజాపంపిణీ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement