సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్మల్‌ మున్సిపల్‌ అధికారులు గురువారం సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగంపై నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సముదాయాల ను తనిఖీ చేసి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ.28,500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు మాట్లాడుతూ.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని దుకాణదారులకు సూచించారు. పర్యావరణహితమైన బట్ట సంచులను వినియోగించాలని కోరారు. పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపాలిటీ కి సహకరించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ రజిని, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement