తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య | Woman Commits Suicide By Shooting Herself With Revolver In Karnataka, Check Details Of Case | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య

Jun 11 2026 8:06 AM | Updated on Jun 11 2026 9:42 AM

 Woman commits suicide by shooting herself with revolver

కర్ణాటక: ఇంట్లో రివాల్వర్‌తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్‌నోట్‌ రాసి పెట్టారు. 

ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి 

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్‌లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రాచయ్య విచారించి రద్దు చేశారు.  

దర్శన్‌ భార్యకు వేధింపులు  
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ భార్య విజయలక్ష్మి సోషల్‌ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్‌లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్‌ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement