1971 నాటి కేసు మళ్లీ తెరపైకి.. పోలీసుల వేట! | 55 Year Old Case Police Search For Accused In Markapuram | Sakshi
Sakshi News home page

1971 నాటి కేసు మళ్లీ తెరపైకి.. పోలీసుల వేట!

Jul 29 2026 1:36 PM | Updated on Jul 29 2026 1:36 PM

55 Year Old Case Police Search For Accused In Markapuram

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఏఐ ఫోటో)

మార్కాపురం: 1971లో నమోదైన ఓ కేసుకు సంబంధించి 55 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు మంగళవారం మార్కాపురం చేరుకోవడం ఆసక్తి రేకెత్తించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా హద్గావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 55 ఏళ్ల క్రితం నేరం చేసిన రామయ్య కుమారుడు నారాయణ మార్కాపురంలో ఉంటున్నాడన్న సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్‌ యువరాజ్‌ కీర్తిపాల్‌ రాథోడ్‌ ఇక్కడికి వచ్చారు. 

స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు నెల రోజుల్లోపు హద్గావ్‌లోని జేఎంఎఫ్‌సీ కోర్టు2 న్యాయమూర్తి ఎస్‌.ఎస్‌.లోహకరే జాదవ్‌ ఎదుట లొంగిపోవాలని జారీ చేసిన నోటీసులను ఆయన వెంట తీసుకొచ్చారు. కాగా, కేసు నమోదైన 1971 నాటికి మార్కాపురం కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండటం గమనార్హం. నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement