తల్లికి అన్యాయం..తండ్రికి వందనం | Thalliki Vandanam Funds Credited To Fathers Account Prakasam | Sakshi
Sakshi News home page

తల్లికి అన్యాయం..తండ్రికి వందనం

Jul 29 2026 12:58 PM | Updated on Jul 29 2026 1:13 PM

Thalliki Vandanam Funds Credited To Fathers Account Prakasam

ప్రకాశం జిల్లా: తల్లి ఖాతాలో జమ కావాల్సిన తల్లికి వందనం నగదు తండ్రి ఖాతాలో జమయ్యాయి. తల్లికి వందనం డబ్బులు అందరికీ వచ్చినా తన ఖాతాలోకి రాలేదని ఆ తల్లి సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగింది. చివరికి తెలిసిన వారి సహాయంతో సచివాలయ సిబ్బందిని ప్రశ్నిచండంతో అసలు విషయం బయటపడింది.

ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో ఇద్దరూ గ్రామంలోనే వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఒకరు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేయగా, మరొకరు 7వ తరగతి చదువుతున్నాడు. అయితే గత ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం డబ్బులు తల్లి లక్ష్మీ బ్యాంక్‌ ఖాతాలో జమయ్యాయి. కానీ ఈ ఏడాది ఇద్దరు కుమారులకు సంబంధించిన తల్లికి వందనం డబ్బులు రాలేదు.

 ఏం జరిగిందని సచివాలయ అధికారులను ప్రశ్నించగా పెద్ద కుమారుడు మదన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. అయితే మదన్‌కు సంబంధించిన సంరక్షణ అంతా తండ్రి, నాయనమ్మలు చూసుకుంటుండడంతో దాని గురించి తల్లి పట్టించుకోలేదు. కానీ రెండో కుమారుడైన కుంచాల శ్రీనివాసరావు సంరక్షణ మొత్తం తల్లినే చూసుకుంటోంది. కులీనాలి చేసుకొని కుమారుడిని చదివించుకుంటోంది. తల్లికి వందనం డబ్బులు పడలేదని సచివాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించడంతో పరిశీలించిన అధికారులు తండ్రి కుంచాల వెంకటేశ్వర్లు అకౌంట్‌కు జమయ్యాయని తెలిపారు.

 దీంతో ఖంగుతున్న లక్ష్మీ.. భర్తను ప్రశ్నించగా మాకు తెలియదు... మాకు డబ్బులు పడేలేదని నానా మాటలు అని బెదిరించారని లక్ష్మీ తెలిపింది. ప్రతి సారి తన అకౌంట్‌లో పడుతున్న డబ్బులు ఈ ఏడాది ఎందుకు మారిందని దీనిపై ఫిర్యాదు చేసేందుకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చింది. సబ్‌ కలెక్టర్‌ అందుబాటులో లేరు. కావాలనే నా ఖాతాను తీసి వేసి నా భర్త ఖాతాను లింక్‌ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. నేను ఊరిలోనే ఉంటాను..నాకు తెలియకుండా కనీసం నాతో మాట్లాడకుండా ఖాతాను మార్చడం ఏంటని ప్రశ్నిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement