రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ | Tragic Incident In Mysuru: Three Members Of Family Ends Their Life At Kempaiahna Hundi Village | Sakshi
Sakshi News home page

రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ

Jun 23 2026 7:51 AM | Updated on Jun 23 2026 11:43 AM

Tragic Incident In Mysuru: Three Members Of Family Ends Their Life At Kempaiahna Hundi Village

కుమార్తె రక్షితతో శివన్న దంపతులు (ఫైల్‌)

కర్ణాటక: మైసూరు జిల్లాలోని టి.నరసిపుర తాలూకాలోని కెంపయ్యన హుండి గ్రామంలో ఘోర దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, కూతురు మరణ వాంగూల్మం  రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివన్న–నాగరత్న దంపతులు, వారి కుమార్తె రక్షిత (20) మృతులు. అదే గ్రామానికి చెందిన ఉల్లాస్‌ గౌడ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

విలన్‌.. ఉల్లాస్‌గౌడ  
శివన్న, నాగరత్న దంపతులు కూతురు రక్షితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 24న ఆ యువతి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉల్లాస్‌గౌడ రక్షితను ప్రేమించానని, తానే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ రక్షిత, ఆమె తల్లిదండ్రులు అతనిని అంగీకరిచలేదు. కానీ ఆ యువకుడు రక్షితను వెంటాడుతూ వేధిస్తున్నాడు. రక్షితతో పెళ్లి నిశ్చయమైన యువకునికి చెడు సందేశాలను పంపసాగాడు.

తాను ఆమెను ప్రేమించానని, నీవు పెళ్లి చేసుకోరాదని బెదిరించాడు. గ్రామంలోనూ ఇదే మాదిరిగా ప్రచారం చేయసాగాడు. దీంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది.  తీవ్ర ఆవేదన చెందిన రక్షిత, ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇల్లు స్మశానంలా ఏడుపులతో మార్మోగింది. వరుణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలాదండి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వారి డెత్‌నోట్‌ను స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఉల్లాస్‌గౌడను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement