బెంగళూరు: డబ్బు కోసం 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఆఫ్రికాలో వ్యభిచార గృహానికి అమ్మిన ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. సంచారజాతికి చెందిన దంపతులు మూలికల కోసం ఆఫ్రికాలోని సెనగల్ దేశానికి వెళ్లారు. అక్కడ తమ కూతురిని రూ.7 లక్షలకు విక్రయించారు. బాధితురాలు ఎలాగో చిక్కమగళూరులో ఉంటున్న బ«ంధువులకు వీడియో కాల్ చేసి తన దుస్థితిని వివరించింది. సహాయం చేయాలని వేడుకొంది. అక్కడి భారత రాయబార సిబ్బంది, పోలీసులు ఆమెను కాపాడారు. ఈలోపు తల్లిదండ్రులు ఊరికి వచ్చేశారు.
కామాంధుడు అరెస్ట్
= మహిళల లోదుస్తుల చోరీ కేసు
దొడ్డబళ్లాపురం: మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్న కామాంధుడిని బెంగళూరు ఇందిరా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హొయ్సళ నగర్‌లో నివసిస్తున్న పలువురు మహిళలు ఉతికి ఆరేసిన తమ లోదుస్తులు కనబడకుండా పోతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిందితుడిని కనిపెట్టారు. అస్సాంకు చెందిన అబ్దుల్ హుసేన్ అరెస్ట్ మహిళలు ఉతికి ఆరేసిన లోదుస్తులను తస్కరించి వాటిని ధరించి కొన్ని రోజులకు మళ్లీ తెచ్చి అక్కడే పెట్టి వెళ్లిపోయేవాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడు అబ్దుల్ హుసేన్‌ను అరెస్ట్ చేశారు.


