అయోధ్య రామాలయం అద్భుతం | Tesla CEO Elon Musk Father Visits Ram Temple, More Details Inside | Sakshi
Sakshi News home page

అయోధ్య రామాలయం అద్భుతం

Jun 5 2025 6:35 AM | Updated on Jun 5 2025 9:44 AM

Tesla CEO Elon Musk father visits Ram Temple

బాలరాముడిని దర్శించుకున్న ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ 

అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్‌ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌ బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. 

ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్‌ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్‌ మస్క్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్‌ మస్క్‌ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్‌ కూడా ఉన్నారు. ఎరోల్‌ మస్క్‌ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్‌ రెన్యూవబుల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు ఎరోల్‌ మస్క్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement