breaking news
Alexandra
-
తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?
రోగిగా ఉన్నప్పుడు డాక్టర్ చూపిన దయ..ఆ వృత్తిని చేపట్టాలనే ఆకాంక్షకు తెరతీసింది. పోనీ చదివేసి డాక్టర్ అవుదామంటే..తనకున్న శారీరక పరిస్థితులు..నువ్వా అంటూ వెక్కిరించాయి. కానీ అలాంటి అభిప్రాయాలకు తలవంచనంది. తనలాంటి వాళ్లు కూడా బేషుగ్గా వైద్యం అందించగలరు అని చూపాలనుకుంది. పోరాడుతూనే చదివింది. చివరికి యావత్తు ప్రపంచమే విస్తుపోయేలా తొలి అంధ చెవిటి డాక్టర్‌గా నిలిచి..యువతకు స్ఫూర్తిగా మారింది.ఆ అజేయమైన ధైర్యశాలే అలెగ్జాండర్ ఆడమ్స్. ఆమె పుట్టకతో చెవిటి, అంధ దివ్యాంగురాలు. అలాగని తనను తాను ఏమి ప్రత్యేక వ్యక్తిగా భావించేది కాదు. అందరి పిల్లల్లానే హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేందుకే ప్రయత్నించేది. టీనేజ్ వయసులో ఉండగా..సరిగ్గా కరోనా మహమ్మారి టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై దాదాపు 17 నెలల పాటు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) అనే రోగనిరోధక రుగ్మత బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దాని ఫలితంగా ఆమె నిరంతరం ఆక్సిజన్‌ను ఉపయోగించాల్సిందే. ఇన్ని ఆరోగ్య సవాళ్ల అంటే ఎవ్వరైన కుంగిపోతారు. కానీ ఆడమ్స్ అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. అత్యంత ధైర్యంతో ఆ సవాళ్లన్నింటిని ఎదిరించి తన జీవితాన్ని అందంగా మార్చుకోవాలనుకునే ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. ఆస్పత్రిలో రోగిగా మంచానికే పరిమితమైన క్షణాల్లోనే డాక్టర్ ఎంతో ప్రేమగా మీరు బాగానే ఉన్నారా? అని అడిగిన మూడు పదాలు ఆమెను డాక్టర్ అవ్వాలనే ఆశయానికి ఊపిరిపోశాయి. పోనీ వైద్య విద్య అభ్యసించడం అడమ్స్ ఉన్న శారీరక పరిస్థితికి అంత సులభమా అంటే కానేకాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పైగా చుట్టూ ఉన్నవాళ్లంతా తన వల్ల కాదని అంటున్నా..చెప్పడానికి వాళ్లెవరరు అన్న మొండి పట్టుదలతో డాక్టర్ విద్యనే అభ్యసించిందేకు రెడీ అయ్యింది. కానీ అక్కడ కళాశాలలో దారుణమైన వివక్షను ఎదుర్కొంది. అంతా ఆమెనా డాక్టర్ అంటూ పెదవి విరిచేవారు. దానికి ఆడమ్స్ తన వైకల్యమేమి డాక్టర్ వృత్తికి అడ్డంకి కాదని, ప్రజల అభిప్రాయాలే అడ్డంకి అని ధైర్యంగా చెప్పేది. అయితే ఆమె డాక్టర్‌గా అర్హత సాధించడానికి కేవలం కొన్ని నెలల ముందే వైద్య వృత్తి నుంచి తప్పుకోమని వైద్య శాఖ నుంచి గట్టి ఆదేశాలు వచ్చాయి. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే లండన్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో క్రియేటివ్ రైటింగ్‌లో మాస్టర్స్ కోర్సుకు సంబంధించిన ఒక ప్రకటన ఆమెను ఆకర్షించింది. వెంటనే ఒక పక్క మెడికల్ స్కూల్లో తిరిగి చేరాలనే పోరాటం చేస్తూనే..రచనలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది. అలా రచనల్లో తనకున్న స్కిల్‌ని గుర్తించింది. అంతేగాదు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి తిరిగి తన 11 ఏళ్ల మెడికల్ డిగ్రీని కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. అలాగే 'ఇన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఆల్' అనే పేరుతో యూకే తొలి బధిర అంధ వైద్యురాలి కథ అంటూ తన స్టోరీని రాసింది. మరి ఆమె ఎలా వైద్యం చేస్తుందంటే.. ప్రతి వైద్య ప్రక్రియకు వినికిడి, దృష్టితో పనిలేదని అంటుంది. ఆమె రోగుల గుండె, ఊపిరితిత్తుల ఉనికిని వినడానికి వినికిడి పరికరాలకు నేరుగా అనుసంధానించే బ్లూటూత్-ఎనేబుల్డ్ స్టెతస్కోప్‌ను ఉపయోగిస్తుంది. పరిమిత దృష్టి ఉన్నప్పటికి ఐవీ వంటివి ఎలా పెడతారని అడిగితే..అదంతా స్పర్శ అనుభూతికి చెందిందని అంటుంది. నిజానికి అనుభవజ్ఞులైన వైద్యులు స్పర్శపై ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి, వైద్య విద్యార్థులను ఈ నైపుణ్యాన్ని నేర్చుకునేటప్పుడు కళ్ళు మూసుకోమని తరచుగా ప్రోత్సహిస్తారని ఆమె చెబుతుంది. దీని వల్ల ఒ కరకంగా తన వైకల్యం బలహీనత కాదని, రోగులతో మరింత లోతుగా అనుసంధానం కావడానికి అదొక అడ్వాంటేజ్‌గా మారిందని సగర్వంగా చెబుతోంది ఆడమ్స్.పని చేస్తున్నప్పుడు సురక్షితంగా సంభాషించడానికి సహాయపడే వైబ్రేటింగ్ పేజర్లు, రేడియో ఎయిడ్స్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో తనపై ఉండే సందేహాలను తొలగించేలా వివరణ అందించడమే కాకుండా వృద్ధుల సంరక్షణ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె కథ వైకల్యం అనేది సామర్థ్యాన్ని నిర్వచించలేదని, కఠిన శ్రమతో ఏ కలనైనా సాకారం చేసుకోవచ్చని నిరూపించడమే కాకుండా భావితరాలకు ఆదర్శంగా నిలిచింది.(చదవండి: తాత గారు వేళకు మందులు వేసుకోవాలని..! టీనేజ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ..) -
అయోధ్య రామాలయం అద్భుతం
అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు. -
యువరాణికి గౌరవ వందనం
రాణులంటే చుట్టూ సేవలందించే మందీ మార్బలం, సకల హంగులు అమరే జీవనంగా మన కళ్ల ముందొక దృశ్యం నిలుస్తుంది. కానీ, ప్రజల గురించి ఆలోచించి, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోరాటం చేసి, సాధించిన అతి కొద్దిమందిలో రాణులలో సోఫియా అలెగ్జాండ్రా దులీప్‌సింగ్ ఒకరు. లండన్‌లోని ప్రముఖ రాయల్ మెయిల్ తపాలాశాఖ ‘రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ –1918’ శత వసంతాలను పురస్కరించుకొని ఆనాడు ఈ చట్టం కోసం ఉద్యమించిన 8 మంది ప్రముఖులను ఎంపిక చేసి, వారి గౌరవార్థం స్టాంప్‌లను విడుదల చేసింది. అందులో ఆసియా తరఫున ఎంపికైన ఒకే ఒక్క ఉద్యమ మహిళ మన భారతీయ యువరాణి సోఫియా! యువరాణి సోఫియా తండ్రి మహారాజా దులీప్‌సింగ్. ఆయన పంజాబ్ పాలకుడు. సోఫియా ఆగస్టు 1876 ఆగస్టు 8న పంజాబ్‌లోనే జన్మించారు. గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజకీయ వ్యూహాలు పన్ని ఈ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత దులీప్‌సింగ్ ఇంగ్లండ్ నుంచి బహిష్కృతుడయ్యాడు. తల్లి బాంబా ముల్లర్ కూతురు సోఫియాను తీసుకొని ఇంగ్లండ్‌లోని రాణీ విక్టోరియా హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ చేరారు. తల్లితో కలిసి సోఫియా అక్కడే నివసించేవారు. విక్టోరియా రాణి సోఫియాను దత్త పుత్రికగా భావించేవారు. 19వ శతాబ్ది చివర్లో, 20వ శతాబ్ది ప్రారంభంలో బ్రిటన్‌లో ప్రజా ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు తప్పనిసరిగా ఉండితీరాలనే అంశం తలెత్తింది. అది ఉదమ్యంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి సోఫియా ప్రాతినిధ్యం వహించారు. అలాగే ‘ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్’లోనూ సోఫియా ప్రముఖ పాత్ర పోషించారు. మహిళల సామాజిక, రాజకీయ సంఘాలతో సహా ఇతర మహిళా బృందాలలోనూ ఆమె నాయకత్వాన్ని అందించారు. ఇంగ్లండ్‌లోనే 1948 ఆగస్టు 22న సోఫియా మరణించారు. బి.బి.సి. జర్నలిస్ట్ అనితా ఆనంద్ నివేదిక ప్రకారం సోఫియాను దాదాపు 70 ఏళ్ల పాటు ఈ దేశం మర్చిపోయింది. ‘ఆసియా మహిళ’ అంటూ సోఫియా గురించి ఆనంద్ రాసిన పుస్తకంలో రాణిగా, పోరాటయోధురాలిగా, విప్లవకారిణిగా ఆమెను కీర్తించారు. – ఎన్.ఆర్. సోఫియా అలెగ్జాండ్రాపై అనితా ఆనంద్ రాసిన పుస్తకం


