ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు మృతి | Tennis players die in road accident in UP | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు మృతి

Oct 7 2026 2:40 PM | Updated on Oct 7 2026 2:56 PM

Tennis players die in road accident in UP

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై టెన్నిస్ క్రీడాకారులతో వెళ్తున్న కారు ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధన్‌పట్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్‌బదేరి సమీపంలో ఉదయం సుమారు 5.30 గంటలకు జరిగింది. ఈ వివరాలను పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆరుగురు టెన్నిస్ క్రీడాకారులు లక్నోలో జరిగిన ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొని తిరిగి దేవరియాకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో కారు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రక్కును ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయినట్లు అధికారులు తెలిపారు.  దీంతో అందులోని వారంతా కారులోనే చిక్కుకోని పోగా పోలీసులు స్థానికుల సహాయంతో కారు తలుపులు పగులగొట్టి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అనంతరం ఆరుగురినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులు దేవరియాకు చెందిన నిత్య ప్రజాపతి (22), ఇర్ఫాన్ అన్సారీ (20), బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన అనికేత్ (24)గా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆనంద్ యాదవ్ (23), రాజు (22), పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌కు చెందిన జయంతో శర్మ (30)గా గుర్తించారు. వీరిని మెరుగైన చికిత్స కోసం అయోధ్య మెడికల్ కాలేజీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారిలో ఎక్కువ మంది నిద్రలో ఉన్నారని, ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా కుదుపు రావడంతో మేల్కొన్నామని జయంతో శర్మ పోలీసులకు తెలిపినట్లు అధికారులు చెప్పారు.
 

ఇదీ చదవండి: టీడీపీ నేత వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement